Header Banner

కల్తీ ఆహారానికి ఫుల్‌స్టాప్! ఆ ప్రాంతంలో ఫుడ్‌ సేఫ్టీ ల్యాబ్‌తో ప్రజలకు భరోసా!

  Thu Apr 24, 2025 15:50        Others

ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఫుడ్​సేప్టీ ల్యాబ్​ను ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆహార కల్తీల గుర్తింపు, వాటి నియంత్రణకు సంబంధించి ఇప్పటివరకు వాటి నమూనాలను ఎంతో వ్యయప్రయాసలకోర్చి హైదరాబాద్‌కు పంపాల్సి వచ్చేది. అనంతరం ఫలితాలు సైతం ఆలస్యంగా రావడంతో చర్యలు తీసుకునేలోగా పుణ్యకాలం పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సైతం నమూనాల స్వీకరణకు నిరాకరిస్తుండటంతో ఐదు రాష్ట్ర స్థాయి ఫుడ్‌ సెఫ్టీ ల్యాబ్‌లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.తిరుపతిలో ఒకటి, తిరుమలలో టీటీడీ కోసం ప్రత్యేకంగా మరో ల్యాబ్‌ కేటాయించడం విశేషం. తిరుమలలోని ప్రయోగశాలను టీటీడీ అవసరాల కోసమే నిర్దేశించగా తిరుపతిలోని ప్రయోగశాలను రాయలసీమ అవసరాల కోసం వినియోగించనున్నారు. తిరుమలలో 12 వేల చదరపు అడుగుల భవనాన్ని టీటీడీ ఆహార భద్రతాధికారులకు అప్పగించగా రాష్ట్రంలో తొలి ప్రయోగశాల ఇక్కడే ప్రారంభించనున్నారు. టీటీడీకి చెందిన శ్రీదేవి కాంప్లెక్స్‌లో ప్రయోగశాల ఏర్పాటుకు అవసరమైన భవనాన్ని అద్దెకు తీసుకున్నారు.

ప్రయోగశాల
ఒక్కో జిల్లా నుంచి గరిష్ఠంగా 400 వరకు నమూనాల్ని పరీక్షించాల్సి ఉంటుంది. తిరుపతిలోని ప్రయోగశాలలో రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే నాలుగు వేల వరకు నమూనాలు పరీక్షించే వీలుంది. ప్రైవేటు వ్యక్తులు సైతం నమూనాల్ని పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. వీటి ద్వారా ఒక్కొక ప్రయోగశాలకు రూ.25 కోట్ల విలువైన పరికరాలు అందుబాటులోకి రానున్నాయి.ఇప్పటికే దీనికి సంబంధించి,మరోవైపు ప్రాంతీయ ఆహార ప్రయోగశాలలు ఎక్విప్‌మెంట్ ఇన్‌స్టలేషన్ కోసంటెండర్ల ప్రక్రియ సైతం ముగిసింది. ముఖ్యంగా నూనెలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, తాగునీరు, శీతల పానీయాలు, సుంగంధ వస్తువులు, వంట సరకులు, బేకరీ వస్తువులు వంటి వాటిని 15 విభాగాలుగా విభజించి 400 పైగా కల్తీలను గంటల వ్యవధిలో విశ్లేషించే వీలుంది.

ఇది కూడా చదవండి: సబ్జా గింజలతో ఫుల్ ఆరోగ్యం! ఆ మూడు రకాల సమస్యలకు ఇదే చక్కటి పరిష్కారం!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు లక్షల మందికి..

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #FoodSafety #PublicHealth #NoMoreAdulteration #TirupatiLab #APGovernment #SafeFood